రితేష్ అరుణాచల ప్రదేశ్ NCC ట్రిప్ :
NCC లో భాగంగా రితేష్ అరుణాచల ప్రదేశ్ ట్రెక్కింగ్ క్యాంపు కి ఈ రోజు 30-11-2014 న గువహతి ఎక్ష్ప్రెస్స్ లో ఏడు గంటల ముఫై నిముషాలకి పవన్ సింగ్ తో బయలుదేరాడు. ఇది మొత్తం సుమారు 15 రోజుల క్యాంపు.
ప్రయాణ సంసిద్దత
క్యాంపు కి వెళ్ళే ముందు 1 ఆంధ్రా bettallion కి వెళ్లి ప్రయాణానికి కావలసిన అన్నింటి గురించి తెలుసుకుని, ప్రయాణ తేదిని, ఎన్ని రోజుల ప్రయాణం, ఏ రైలు కి వెళ్ళవలసింది అన్ని తెలుసుకుని వచ్చాడు.
30వ తేది నవంబరు 2014 న ఉదయం 7:30 కి సికందరాబాద్ నుండి గువహతి ఎక్ష్ప్రెస్స్ లో ప్రయాణం. ఇక్కడ బయలు దేరితే రైలు గువహతి [Secunderabad to Guwahai train journy details] 2వ తేది డిసెంబర్ 2 ఉదయం 5.50కి చేరుకుంటారు.
ఈ ప్రయాణం కోసం NCC వాళ్ళు ముందే రాను పోను రైలు టికెట్లు బుక్ చేసారు. వీరి కోసం ప్రతి ఒక్కరికి దోమ తెర , ఒక పెద్ద బ్యాగు (గొనె సంచి లాంటిది ), ఒక డ్రెస్సు, టోపీ ఇచ్చారు. వీడు ఇక్కడ నుండి ఒక ట్రెక్కింగ్ బాగు, వాళ్ళిచ్చిన పెద్ద బ్యాగు లో అన్ని సర్దుకుని (bisucuits, odomus, బాడీ స్ప్రే , అబ్బో ఇంకా చాలా పెద్ద ఎత్తునే, ట్రాక్ సూట్, స్వెట్టర్, శిల్ప చేసిన చక్రాలు, కేకు, వాటర్ బాటిల్స్ ఇంకా చాల )
ఆ రోజు పొద్దునే 2 గంటల నుండి ప్రయాణ సన్నాహాలు మొదలెట్టారు. మొత్తం 4 సంచులు. పవన్ సింగ్ , రితేష్, 5 గంటల mmtc ఎక్కి సికందరాబాద్ వెళ్ళారు. నేను శిల్ప తరువాత బండి లో రెండు బ్యాగులతో స్టేషన్ చెరుకున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి